ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది..ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు…కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రీమియర్స్ నుంచి ఆల్రెడీ టాక్ బయటకి వచ్చేసింది.. సోషల్ మీడియాలో ఈ సినీమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా మొదటి షోకే మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
టీజర్ టైంలో మూవీ టీం VFX విషయంలో భారీ ట్రోలింగ్ ఎదురుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీలో కొన్ని చోట్ల VFX సూపర్ ఉంటే, కొన్ని చోట్ల మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది అంటూ కామెంట్లు పబ్లిక్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలోని హైలెట్స్ విషయానికొస్తే..రాముడి, రావణాసురుడి ఎంట్రీ అంటున్నారు. అలాగే హనుమాన్ సంజీవని అండ్ లంక సీన్స్ గూస్‌బంప్స్ అంటున్నారు.
ఇక శబరి, సుగ్రీవుడు, రాముడు మధ్య సన్నివేశాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలుస్తుంది.. సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చివరిగా ఎటువంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. థియేట్రికల్ రైట్స్ ద్వారా 270 కోట్ల వరకు, శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్ ద్వారా దాదాపు 210 కోట్ల పైగా వచ్చినట్లు సమాచారం.. మరి సినిమా కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.. మొత్తానికి సినిమా హిట్ అనే టాక్ పబ్లిక్ లో నడుస్తుంది..