Site icon NTV Telugu

Adipurush: డ్రాప్ ఉన్నా… ఇతర స్టార్ హీరోలు టచ్ చెయ్యలేని కలెక్షన్స్ రాబడుతోంది

Adipurush

Adipurush

ఓ వైపు మిక్స్‌డ్ టాక్.. మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకోవైపు కోర్టులు, కేసులు, వివదాలు.. అయినా కూడా ఆదిపురుష్‌ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతునే ఉంది. డివైడ్‌ టాక్‌తో మొదలైన శ్రీరాముడి బాక్సాఫీస్ వేట.. ఆరు రోజుల్లో 410 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు సార్లు 400 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఆదిపురుష్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ ఇతర హీరోలకి మాత్రం అందనంత వసూళ్లని మాత్రం రాబడుతోంది. బాహుబలి వన్, బాహుబలి 2 తర్వాత ఆదిపురుష్‌ 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది. అయితే.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్‌కు ఒక్క సినిమా మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. సాహో తెలుగులో ఆడకపోయినప్పటికీ.. హిందీ బెల్ట్‌లో మాత్రం దుమ్ములేపింది. నష్టాల సంగతి పక్కన పడితే.. ఓవరాల్‌గా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది సాహో. కానీ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమానే భారీ నష్టాలను మిగిల్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల దగ్గరే ఆగిపోయింది. రాధే శ్యామ్ కూడా సాహో రేంజ్‌ వసూళ్లను రాబట్టి ఉంటే.. బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలతో నాలుగు సార్లు 300 కోట్లు, 400 కోట్ల గ్రాస్ రాబట్టిన హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేవాడు. కానీ రాధే శ్యామ్ ప్రభాస్ రికార్డులకు బ్రేక్ వేసింది. ఈ ఒక్క సినిమా తప్పితే.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలన్నీ 400 కోట్ల మార్క్‌ని టచ్ చేశాయి. మొత్తంగా ఆదిపురుష్‌ సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ సెట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో మూడో స్థానంలో నిలవనుంది ఆదిపురుష్‌. మరి లాంగ్‌ రన్‌లో ఆదిపురుష్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

Exit mobile version