Adipurush: డ్రాప్ ఉన్నా… ఇతర స్టార్ హీరోలు టచ్ చెయ్యలేని కలెక్షన్స్ రాబడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు మిక్స్‌డ్ టాక్.. మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకోవైపు కోర్టులు, కేసులు, వివదాలు.. అయినా కూడా ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతునే ఉంది. డివైడ్ టాక్‌తో మొదలైన శ్రీరాముడి బాక్సాఫీస్ వేట.. ఆరు రోజుల్లో 410 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు సార్లు 400 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఆదిపురుష్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ ఇతర హీరోలకి మాత్రం అందనంత వసూళ్లని మాత్రం రాబడుతోంది. బాహుబలి వన్, బాహుబలి 2 తర్వాత ఆదిపురుష్ 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది. అయితే.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్‌కు ఒక్క సినిమా మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. సాహో తెలుగులో ఆడకపోయినప్పటికీ.. హిందీ బెల్ట్‌లో మాత్రం దుమ్ములేపింది. నష్టాల సంగతి పక్కన పడితే.. ఓవరాల్‌గా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది సాహో. కానీ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమానే భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల దగ్గరే ఆగిపోయింది. రాధే శ్యామ్ కూడా సాహో రేంజ్ వసూళ్లను రాబట్టి ఉంటే.. బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలతో నాలుగు సార్లు 300 కోట్లు, 400 కోట్ల గ్రాస్ రాబట్టిన హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేవాడు. కానీ రాధే శ్యామ్ ప్రభాస్ రికార్డులకు బ్రేక్ వేసింది. ఈ ఒక్క సినిమా తప్పితే.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలన్నీ 400 కోట్ల మార్క్‌ని టచ్ చేశాయి. మొత్తంగా ఆదిపురుష్ సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ సెట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో మూడో స్థానంలో నిలవనుంది ఆదిపురుష్. మరి లాంగ్ రన్‌లో ఆదిపురుష్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.
Also Read
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
#AdiPurush divine triumph all over🏹🔥#AdiPurushBlockBuster#AdiPurush3D#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @SachetParampara @neerajkalyan_24 @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @amb_cinemas @vishwaprasadtg… pic.twitter.com/j8LvW5l5PV
— People Media Factory (@peoplemediafcy) June 22, 2023
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!