NTV Telugu Site icon

Adipurush Collections: ఆదిపురుష్‌.. ఓపెనింగ్స్‌తో ఆలిండియా రికార్డుల బద్దలు?

Adipurush Day 1 Estimated Collections

Adipurush Day 1 Estimated Collections

Adipurush Advance Booking Collections: రామాయణ మహా గ్రంధం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలు కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించిన ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ టి సిరీస్ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సుమారు 185 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. ఇక భారత దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఆది పురుష్ సినిమాకి రిలీజ్ కి ముందే భారీ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి లక్ష టికెట్లు అమ్మినట్లు పివిఆర్ చైన్ ప్రకటించింది. ఇక ఒక్క హిందీలో మాత్రమే 70 వేల టికెట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడైనట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Also Read: Adipurush: ’ఆదిపురుష్’ దెబ్బకి Book My Show సర్వర్లు క్రాష్.. ఏమన్నా క్రేజా ఇది?

ఇప్పటి వరకు హిందీలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు మాత్రమే ఈ స్థాయి బుకింగ్స్ చోటు చేసుకున్నాయని ఈ సినిమా బుకింగ్స్ ఇంకా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త లేటుగానే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే భారతదేశంలో పూర్తిస్థాయిలో ఆది పురుష్ మేనియా కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు భారతదేశంలో కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే భారతదేశంలో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నా అమెరికా సహా మిగతా విదేశాల్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే రెండు హాలీవుడ్ సినిమాలు స్పైడర్ మాన్, ట్రాన్స్ఫార్మర్లు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడుతున్నాయి. దానికి తోడు ఆది పురుష్ రిలీజ్ రోజునే ది ఫ్లాష్ సహా మరొక హాలీవుడ్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.

Also Read: Adipurush: నార్త్ లో మెంటల్ ఎక్కిస్తున్న ఆదిపురుష్ క్రేజ్

దీంతో ఆది పురుష్ సినిమాకి విదేశాల్లో స్క్రీన్లు దొరకడం కష్టమవుతుంది. ఈ క్రమంలో కొంత అక్కడి వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్లు మొదటి రోజుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ గ్రాండ్గా ఓపెనింగ్ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమాను 310 లొకేషన్లలో 750 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా ఇప్పటికే అర మిలియన్ డాలర్లు వసూలు చేసేసింది. మన భారత రూపాయల్లో చూసుకుంటే నాలుగు కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సంపాదించేసింది. ఇంకా ఒక రోజు సమయం ఉంది కాబట్టి అది మిలియన్ డాలర్ దాటేసినా ఇక ఆశ్చర్యం లేదు. యూకే లో కూడా ఈ సినిమాని ఓ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా దాదాపు 7000 టికెట్లు అమ్ముడయ్యాయి, ఆస్ట్రేలియాలో 6700 టికెట్లు పైగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు తిరగరాసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏకంగా మొదటి రోజు అంతా బాగుంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే దాదాపు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.