Adipurush: ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ఈ సినిమా హిట్ అవ్వాలని అభిమానులతో పాటు స్టార్ హీరోలు కూడా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ సినిమాలో నటించినవారి రెమ్యునిరేషన్స్ వార్తలు హైలైట్ గా మారాయి. దాదాపు రూ. 500 కోట్లు పెట్టి నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ ఖర్చు కాకుండా నటీనటులకు మరో రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ముఖ్యంగా పాన్ ఇండియా ప్రభాస్ కే.. ఈ సినిమాకోసం రూ. 150 కోట్లు ఇచ్చారని అంటున్నారు.
Mayapetika Trailer: నువ్వేమైనా పతివ్రతను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా..?
బాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యూనిరేషన్ తీసుకున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. ఇక ప్రభాస్ తరువాత అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడు రావణ బ్రహ్మ సైఫ్ ఆలీఖాన్. ఈ పాత్ర కోసం ఆయన దాదాపు రూ. 12 కోట్లు అందుకున్నాడట. ఇక సీతగా నటించిన కృతికి రూ 3 కోట్లు ముట్టజెప్పారట. ఆ తరువాత లక్ష్మణుడుకు రూ. 1.5 కోట్లు.. హనుమంతునికి రూ. 2 కోట్లు అందినట్లు సమాచారం. ఒక కీలక పాత్రలో చేసిన సోనాల్ చౌహన్ కు రూ. 50 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెమ్యూనిరేషన్ లెక్కలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ప్రభాస్ రెమ్యూనిరేషన్ గురించే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రేపు కనుక ఈ సినిమా మొదటిరోజే వంద కోట్లు కలక్ట్ చేస్తే ఉంటుంది.. ప్రభాస్ రేంజ్.. బాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోతుంది. మరి రేపు ఆదిపురుష్ టాక్ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.