Adikeshava Leelamma Song Released: మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి స్టార్ హీరో హీరోయిన్ల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం పరిపాటే ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. ‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అంతా పాల్గొంది. పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది అని అన్నారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “ఇప్పుడే అమ్మవారి దసరా అయింది, నవంబర్ 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తుందని అన్నారు. ‘లీలమ్మో’ నాకు ఎంతో ఇష్టమైన పాట, పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట అని అన్నారు. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట, ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, వైష్ణవ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుందని అన్నారు.
Anchor Suma: మీడియాపై నోరు జారిన సుమ.. రిపోర్టర్ దెబ్బకు లైవ్ లోనే క్షమాపణలు
ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్, పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలనిపించింది అంత బాగుంటుంది ఈ పాట అని అన్నారు. ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఆదికేశవ’ అనే మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో ఆదికేశవ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాట మనం పరిశీలిస్తే డ్యాన్స్ మూవ్‌మెంట్‌లు, హీరోహీరోయిన్ల జోష్ ‘లీలమ్మో’ పాటను మాస్ మెచ్చే పాటగా మలిచాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఇప్పుడు ‘లీలమ్మో’ పాట అంతకుమించి ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టిన ఆదికేశవ చిత్రం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.