Site icon NTV Telugu

Adhira : అధీర నుండి.. అగ్నిపర్వతాల మధ్య ఎస్. జె. సూర్య పోస్టర్ రిలీజ్..

Adhira

Adhira

క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్‌ ఫిల్మ్ ద్వారా సంచలనాన్ని సృష్టించిన ఆయన, తర్వాతి ప్రాజెక్ట్ హనుమాన్ ద్వారా సూపర్ హీరో యూనివర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ యూనివర్స్‌లో కొత్త అప్‌డేట్ ‘అధీర’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి ప‌ల్లవి..

శరణ్ కొప్పిశెట్టి  దర్శకత్వ వహిస్తున్నా ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తున్నారు. నిర్మాణం ఆర్కే డీ స్టూడియోస్ (రివాజ్ రమేష్ దుగ్గల్) ఆధ్వర్యంలో జరుగుతుండగా, సంగీతం శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ శివేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల్ చేస్తున్నారు.

అయితే  తాజాగా  మూవీ నుండి ఎస్. జే. సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఎంతో ప్రత్యేకంగా  బ్యాక్‌డ్రాప్‌లో అగ్నిపర్వతం, మంటలు, లావా మరియు బూడిదతో ఆకాశం కప్పబడి.. ఆ కల్లోలంలో ఎస్. జే. సూర్య బుల్‌ కొమ్ములతో, ట్రైబల్ దుస్తుల్లో, క్రూరమైన రాక్షసుడి లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్ల పై కూర్చుని ధైర్యంగా పైకి చూస్తూ, మోడరన్ వార్ అవతార్‌లో సూపర్ హీరోగా కనిపించారు.

కథా నేపథ్యం ప్రకారం, ‘అధీర’ ఆశ, అంధకారం మధ్య యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్ ఉపయోగిస్తారు. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టంట్స్, గ్రేట్ విజువల్స్, హై వోల్టేజ్ డ్రామా సినిమాను థియేటర్స్‌లో థండర్‌క్లాప్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చనుంది. మొత్తనికి ప్రశాంత్ వర్మ సృష్టించిన సూపర్ హీరో డ్రీమ్ యూనివర్స్‌లో ‘అధీర’ ఒక మహా సంగ్రామానికి నాంది పలికే లా ఉంది. మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

Exit mobile version