Site icon NTV Telugu

‘అద్భుతం’ ట్రైలర్: ఒకే ఫోన్ నంబర్ ఇద్దరికి ఇచ్చేస్తే.. జరిగింది ఏంటి?

తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా భారీ అంచనాలనే రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

ట్రైలర్ విషయానికొస్తే.. తేజ, శివాని వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటారు. వారిద్దరికి ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది.. ఒకరి కాల్స్ ఒకరికి వెళ్తూ ఉంటాయి.. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు ఆశ్చర్యపోతారు.. ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు.. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అనేది హ్యూమరస్ గా చూపించారు. చివర్లో ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ కథనా..? అని అనుమానం కలిగించి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ట్రైలర్ లో వైవా హర్ష కామెడీ అదిరిపోయింది. తేజ, శివాని జంట ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. ఇష్క్ సినిమాతో పరాజయం చవిచూసిన తేజ ఈ సినిమాతో విజయం అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version