Adah Sharma buys flat Sushant Singh Rajput lived in before his death: ది కేరళ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆదాశర్మ ఆ తర్వాత హాస్పిటల్ పాలై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మరోసారి ఒక షాకింగ్ విషయంతో వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే ఆమె తాజాగా ముంబైలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఆ ఫ్లాట్లో గతంలో ఒక హీరో సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు.. అసలు విషయం ఏమిటంటే ఎం.ఎస్ ధోని సినిమాతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పలు కారణాలతో తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముందు పోలీసులు సూసైడ్ పేరుతో కేసు క్లోజ్ చేసినా, తర్వాత సీబీఐ చేతికి ఈ కేసు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణ లోనే ఉంది.
Chiranjeevi: చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్..మోకాలి సర్జరీ తరువాత మొదటి ఫొటో ఇదే!
అయితే సుశాంత్ సింగ్ రాజ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఫ్లాట్ ని ఆదాశర్మ కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ లో వార్తలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ఆదాశర్మ టీంతో కన్ఫామ్ చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియా వార్తా కథనాలు వెలువరిస్తోంది. నిజానికి గతంలో ఇదే ఫ్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అద్దెకు ఉండేవారని, దాదాపు నాలుగున్నర లక్షల వరకు అద్దె కూడా చెల్లించేవారు అని తెలుస్తోంది. అయితే అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన మాట వాస్తవమే కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివసించిన ఫ్లాట్ అదేనా లేక ఆదాశర్మ కొనుగోలు చేసిన ఫ్లాట్ మరొకటా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక ఈ విషయం మీద ఆమె స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు.