ఎవరికైన వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకి వయసు మీద పడే కొద్దీ ఫేస్ గ్లో తగ్గి, ఏజ్ కనిపిస్తుంది. ఈ ఏజ్ కనిపించకుండా చెయ్యడానికే సెలబ్రిటిలు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఒకవేళ తెరపై కనిపించే సమయంలో ఏజ్ కనిపించినా, ఏజ్ ఎక్కువ ఉన్న ఆర్టిస్టులని యంగ్ గా చూపించాలన్నా డీ-ఏజింగ్ టెక్నాలజిని వాడుతూ ఉంటారు. ఈ డీఏజింగ్ టెక్నాలజిని ఇన్ బిల్ట్ తన బాడీలో పెట్టుకుందో లేక ఆమెకి వయసే వెనక్కి వెళుతుందో తెలియదు కానీ తమిళ బ్యూటీ త్రిషా ఎఫోర్ట్ లెస్లీ బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఏజ్ తో సంబంధం లేకుండా త్రిష రోజురోజుకి అందంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల వయసులో చాలా మంది హీరోయిన్స్ కెరీర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుంటే త్రిష కెరీర్ మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది.
Read Also: Trisha Krishnan ‘Raangi’ Movie: రాంగీ కోసం పోరాడుతున్న త్రిష
ఇటివలే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్-త్రిష ఎదురుపడే సీన్ చూస్తే త్రిషకి నాలుగు పదుల వయసు ఉందంటే ఎవరూ నమ్మరు. వయసులో వెనక్కి అందంలో ముందుకి వెళ్తున్న త్రిష నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాంగి’. ఆన్ లైన్ ఛానెల్ రిపోర్టర్ ‘తాయల్ నాయగి ‘ పాత్రలో త్రిష కనిపించానున్న ఈ సినిమా డిసెంబర్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. చాలా రోజుల తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న త్రిష, ‘రాంగి’ మూవీ కోసం ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి. వీటిని చూసిన సినీ అభిమానులు త్రిషకి ఇంకా వయసు అవ్వలేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 2023లో త్రిష పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకి రానుంది.
Read Also: Trisha Krishnan: 40వ వసంతంలోకి అడుగులు.. పూరీ పారితోషకం ఎంతో తెలుసా?