Nenevaru: తనిష్క్ రాజన్ చిరు ప్రాయంలోనే రంగస్థల నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు నాటకాలు ప్రదర్శించింది. పన్నెండేళ్ల వయసులో తన సోదరితో కలిసి తనిష్క్ రాజన్ ముంబైకి వెళ్లడంతో వెండితెరపై ప్రయాణం మొదలైంది. టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగిందామె. 2017లో ‘శరణం గచ్చామి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తనిష్క్ రాజన్. అందులో తన నటన, అందంతో అందరినీ మెప్పించింది. దాంతో ఆమెకు ”దేశంలో దొంగలు పడ్డారు, ఇష్టంగా, బైలంపూడి, కమిట్‌మెంట్” సినిమాల్లో నటించే ఛాన్స్ లభించింది.
తాజాగా తనిష్క్ రాజన్ ‘నేనెవరు’ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అవుతోంది. కోలా బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీని నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించారు. ఈ సినిమా గురించి తనిష్క్ మాట్లాడుతూ, ”బేసికల్ గా నేనే డైరెక్టర్ ఆర్టిస్టును. ఆయన విజన్‌కు తగ్గట్టుగా నటించేందుకు ప్రయత్నిస్తాను. ఇక్కడ అవకాశాలు అంత సులువుగా రావు. వచ్చిన అవకాశాన్ని, మనసుకు నచ్చిందిగా చేసుకుని ముందుకు సాగాలి. కష్టపడి పనిచేస్తే మనల్ని ఏదీ ఆపలేదని నేను నమ్ముతాను” అని చెప్పింది. నిజానికి తన ప్రయాణం ఇంకా మొదలు కాలేదనే తాను భావిస్తానని, ప్రేక్షకుల ప్రేమను అందుకోవడానికి నిరంతరం శ్రమిస్తానని తనిష్క్ రాజన్ తెలిపింది. శాస్త్రీయ సంగీతం, నృత్య కళల్లోనూ ప్రావీణ్యం ఉన్న తనిష్క్ రీసెంట్ గా ‘దో లోగ్’ అనే ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. ఇది యూట్యూబ్ లో సంచలనంగా మారింది. తన చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయని, హిందీలో సినిమాలు, వెబ్ సీరిస్ లు చేస్తున్నానని తనిష్క్ రాజన్ చెప్పింది.
