Actress Tabu: ఆ పని చేశానంటూ.. సీక్రెట్ రివీల్ చేసిన టబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Tabu Reveals A Secret Of Her In Interview: సాధారణంగా నటీనటులు తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టరు. ఏదైనా సరే.. వాటిని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఎంతైనా పబ్లిక్ ఫిగర్స్ కదా.. వాళ్లు సీక్రెట్స్ బట్టబయలైతే, సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఓ ఆట ఆడేసుకుంటారు. అందుకే, ఏవీ బయటపెట్టరు. అయితే.. సీనియర్ టబు మాత్రం ఓ సీక్రెట్‌ని షేర్ చేసింది. అదే.. వయసు పెరుగుతున్నా, తరగని తన అందానికి సంబంధించి రహస్యం. ఓసారి తాను రూ. 50 వేలు ఖరీదు చేసే ఫేస్ క్రీమ్‌ని కూడా కొన్నానంటూ ఈమె కుండబద్దలు కొట్టింది.
ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. ‘మీ అందానికి రహస్యం ఏంటని ఓసారి నా మేకప్ ఆర్టిస్ట్ నన్ను ప్రశ్నించింది. అప్పుడు ఏ సీక్రెట్ లేదని నేను చెప్పాను. అయితే, కొన్ని రోజుల తర్వాత తను నాకు ఒక ఫేస్ క్రీమ్ కొనాల్సిందిగా సూచించింది. దాని విలువ రూ. 50 వేలు. అది కేవలం ఒక్కసారి మాత్రమే కొన్నాను. ఇకపై ఎప్పుడు కొనను’’ అని టబు పేర్కొంది. నిజానికి.. తాను అందంగా కనిపించడం కోసం ఎలాంటి క్రీములు గానీ, ప్రత్యేక ఫేస్ వాష్‌లు గానీ చేయించనని తెలిపింది. కాకపోతే.. బాగా కనిపించడం కోసం చేయాల్సిన సాధారణ పద్ధతుల్ని మాత్రం అనుసరిస్తుంటానని, తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. హెల్దీగా ఉండేందుకు తనవంతు కృషి చేస్తానంది. కానీ, ప్రత్యేకంగా ఇతర కసరత్తులైతే చేయనని చెప్పుకొచ్చింది.
Also Read
కాగా.. బాలీవుడ్‌లో భూల్ భులయ్యా-2 సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న టబు, మరిన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. దృశ్యం-2 సినిమా కోసం తన ఫేవరెట్ నటుడు అజయ్ దేవగణ్‌తో మరోసారి కలిసి నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు తమిళ సినిమా ఖైదీ రీమేక్ అయిన భోలా చిత్రంలోనూ నటిస్తోంది. కేవలం హిందీలోనే కాదు.. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచే వచ్చే ఆఫర్లను సైతం ఒప్పుకుంటోంది.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!