Site icon NTV Telugu

Sushmita Sen: బిగ్ బ్రేకింగ్.. సుస్మితా సేన్ కు గుండెపోటు

Susmitha

Susmitha

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ గుండెపోటుకు గురయ్యింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. “నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకి గురయ్యాను. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే గుండె లోపల స్టెంట్ అమర్చారు. నాకు వైద్యం అందించిన కార్డియాలజిస్ట్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వెల్లడించారు. ఈ ప్రమాదం నుండి నన్ను బయటపడేలా చేసిన చాలామందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే.. నేను బాగానే ఉన్నాను అన్న గుడ్ న్యూస్ ను నా అభిమానులతో అనుచరులతో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Laya: పవన్ భోజనం చేయమన్నా చేయలేదు.. రావడమే గొప్ప అంటూ

ఒక్కసారిగా తమ అభిమాన నటికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్నీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే ఆమె ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రెండు రోజులు అవుతున్నా ఈ విషయం బయటికి తెలియకుండా ఎలా ఉంది అంటూ బాలీవుడ్ మీడియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉండడంతో వారు కొద్దిగా ఊపిరి పీల్చుకొని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version