NTV Telugu Site icon

Surekha Vani: పెళ్లికి కాదు.. ఆ పనికి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి

Surekha Vani

Surekha Vani

Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా తల్లి, పిన్ని పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఎంతో హాట్ గా కూతురుతో కలిసి చిల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక సురేఖ భర్త మరణం తరువాత కూతురు సుప్రీత తో ఒంటరిగా నివసిస్తోంది. భర్త మృతి చెందిన తరువాత సురేఖ రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు గుప్పుమన్నాయి. కూతురు సుప్రీత కూడా తన తల్లికి పెళ్లి చేసే పనిలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా తన రెండో పెళ్లి వార్తలపై సురేఖ స్పందించింది. రెండో పెళ్లిపై ఆలోచనలు లేవు కానీ ప్రస్తుతం ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పి షాక్ ఇచ్చింది. “నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. పెళ్లి గురించి ఆలోచన లేదు. కానీ, నాక్కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బావుండు అనిపిస్తోంది. అతనిలో కొన్ని లక్షణాలు ఉండాలి.

ఎంతో అందంగా ఉండాలి. లైట్ గా గడ్డం ఉండాలి. ఎక్కువ డబ్బు ఉన్న వాడు అయ్యి ఉండాలి. ముఖ్యంగా నన్ను అర్ధం చేసుకొనేవాడు అయ్యి ఉండాలి. నా మాటలు వినడానికి, నన్ను అర్థంచేసుకోవడానికి మాత్రం నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. అలాంటివాడు నాకు దొరికితే.. అతను నాకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటివరకు అలాంటి వాడు దొరకలేదు. నా కూతురు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతోంది. ఏమో ముందు ముందు చేసుకుంటానేమో తెలియదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సురేఖా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఈ వయస్సులో మీరు మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు ఏమైనా సంబంధం ఉందా..? అని కొందరు.. పెళ్లీడు కొచ్చిన కూతురును పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ బుద్ధి ఉందా..? అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments