దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ అర్చన ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రసవ సమయంలో ఒక మహిళ మరణానికి కారణమైందనే ఆరోపణలతో పోలీసు కేసులో చిక్కుకున్న రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడంపై భారతీయ వైద్య సంఘం “తీవ్ర దిగ్భ్రాంతి” వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం చేసిన చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని వైద్యులు కోరుతున్నారు. రాజస్థాన్, దౌసా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అర్చన శర్మపై ప్రసవ సమయంలో మరణించిన మహిళ కుటుంబం కేసు నమోదు చేశారు. అయితే సదరు మహిళ హత్యకు కారణమంటూ తనను నిందించడం అవమానంగా భావించిన డాక్టర్ అమాయక వైద్యులను వేధించవద్దని కోరుతూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది.
Read Also : RGV : తారక్ చరణ్ డేంజరస్… రాజమౌళినీ వదలని వర్మ
దీంతో ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ కు సపోర్ట్ గా సోషల్ మీడియాలో #JusticeForDrArchanaSharma అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రణీత కూడా డాక్టర్ కు సపోర్ట్ గా ఓ ట్వీట్ చేసింది. అందులో “నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలు తన జీవితాన్ని ముగించాల్సి రావడం బాధాకరం” అంటూ పోస్ట్ చేసింది.
