NTV Telugu Site icon

Poorna: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘దసరా’ బ్యూటీ.. ఎవరో తెలుసా..?

Purna

Purna

Poorna: శ్రీ మహాలక్ష్మీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూర్ణ. ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ భామ మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది.. ఆ ఆ తరువాత సీమటపాకాయ్ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. పూర్ణను చూసిన వారందరు స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు.. కానీ, అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ, ఇంకోపక్క బుల్లితెర డ్యాన్స్ షోలలో జడ్జిగా చేస్తూ మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన దసరాలో పూర్ణ నటించి మెప్పించింది. విలన్ చిన్న నంబి భార్యగా పూర్ణ కనిపించింది.

Dil Raju: పొలిటికల్ ఎంట్రీ.. దిల్ రాజు ఏమన్నాడంటే..?

ఇక ఈ సినిమా భారీ విజయం అందుకున్న విషయం విదితమే.. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న అభిమానులకు మరో తీపి కబురు అందించింది పూర్ణ. ఆమె నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది పూర్ణ దుబాయ్ వ్యాపారస్తుడు షానిద్ ఆసీఫ్ ఆలీని వివాహమాడింది. పెళ్ళికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అని, అందుకే గుట్టుచప్పుడు కాకుండా త్వరగా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దసరా.. పూర్ణ పెళ్ళికి ముందు నటించిన సినిమా. తనకు బిడ్డ పుట్టడం, ఆమె నటించిన సినిమా హిట్ కావడం.. రెండు మంచి విషయాలే కావడంతో అభిమానులు రెండింటికి కలిపి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments