Pooja Hegde: అందాల బుట్టబొమ్మ ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే . అయితే ఆమె ఇవ్వలేదు.. రెండేళ్లుగా పూజా ఖాతాలో హిట్స్ ఏమి లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు. అయినా కూడా పూజా హంగామా తగ్గలేదని చెప్పాలి. ఈ సమయాన్ని ఆమె.. తనను తాను మరింత మెరుగు పరుచుకోవడానికి ఉపయోగిస్తోంది. ఒకపక్క వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే.. ఇంకోపక్క జిమ్, బాక్సింగ్ లాంటివి నేర్చుకుంటూ.. మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులు మర్చిపోకుండా చేసుకుంటుంది. తాజాగా ఈ భామ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపింది.
Bhagavanth Kesari: ఉయ్యాలో ఉయ్యాలో.. ఈ తండ్రీకూతుళ్లు చూడచక్కగా ఉన్నారో
రెండు మోకాళ్లకు అయిన గాయాలను చూపిస్తూ బాక్సింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఈ గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చింది. అయితే ఎప్పుడు లేనిది.. సడెన్ గా పూజా బాక్సింగ్ నేర్చుకోవడానికి కారణం ఏంటి నార్మల్ గా నేర్చుకుంటుందా.. ? లేదా ఏదైనా సినిమా కోసం నేర్చుకుంటుందా.. ? అనేది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన బుట్టబొమ్మ అభిమానులు.. అయ్యో.. పూజా .. చూసుకోవాలి కదరా.. చూడు ఎంతపెద్ద దెబ్బ తగిలిందో..? అంటూ బుజ్జగిస్తున్నారు. మరి ఈ బుట్టబొమ్మ.. తన కెరీర్ ను ఎలా సెట్ చేసుకుంటుంది.. ? తదుపరి సినిమా ఎప్పుడు ప్రకటిస్తుంది.. ? అనేది కాలమే నిర్ణయించాలి.
