Site icon NTV Telugu

Bollywood: మళ్లీ ‘MeeToo’ కలకలం… అనురాగ్ కశ్యప్ నన్ను రేప్ చేసాడన్న నటి

Payal Ghosh

Payal Ghosh

హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం తీరాలు దాటి ఇండియాని కూడా చేరింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తామని పేరున్న దర్శక నిర్మాతలు యాక్టర్లు అమ్మాయిలపై చేసిన అఘాయిత్యాల గురించి జరిగిన ఈ ‘మీ టు’ ఉద్యమం ఎన్నో సంఘటనలని బయటకి తెచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ ‘మీ టు’ ఉద్యమం చిన్న సైజ్ దుమారమే లేపింది. ‘మీ టు’ పీక్ స్టేజ్ లో ఉండగానే నెపోటిజం కూడా బయటకి రావడంతో ‘మీ టు’ ఉద్యమాన్ని చాలా మంది మర్చిపోయారు. తాజాగా మరోసారి నార్త్ లో ‘మీ టు’ లాంటి ఇష్యూ ఒకటి బయటకి వచ్చింది. ఎన్టీఆర్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన ‘పాయల్ ఘోష్’ తనని దర్శకుడు అనురాగ్ కశ్యప్ రేప్ చేశాడు అంటూ సంచనల ట్వీట్ చేసింది.

“నేను సౌత్ ఇండియా దర్శకులతో పనిచేశాను. వారిలో నేషనల్ అవార్డు విన్నర్స్ కూడా ఉన్నారు. ఎవరూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ నేను అనురాగ్ కశ్యప్ తో పని చేయలేదు. మా మూడో మీటింగ్ లోనే నన్ను రేప్ చేశాడు. కానీ సౌత్ ఇండియా దర్శకులు చాలా గౌరవంగా ట్రీట్ చేశారు” అంటూ ఒక ట్వీట్ లో అనురాగ్ కశ్యప్ పైన రేప్ కామెంట్స్ చేసింది పాయల్ ఘోష్. ఈ రేప్ కామెంట్స్ లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేసిన పాయల్ ఘోష్ “ఆయన వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. జెంటిల్ మెన్. ఆయనతో కూడా నేను వర్క్ చేశాను. నాతో ఏనాడూ తప్పుగా ప్రవర్తించింది లేదు. అందుకే సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ మీద నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి… అంటూ ట్వీట్ చేసింది. మరీ పాయల్ ఘోష్ చేసిన ఈ రేప్ కామెంట్స్ కి అనురాగ్ కశ్యప్ ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు రెస్పాండ్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Exit mobile version