Site icon NTV Telugu

Pavitra Lokesh: పోలీస్ స్టేషన్ లో నటి పవిత్రా లోకేష్.. అసలు ఏం జరిగింది..?

Pavitra Lokesh

Pavitra Lokesh

కన్నడ సీనియర్ నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా ఆమె ఎక్కువ గుర్తింపు పొందింది టాలీవుడ్ లోనే.. స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా ఆమె నటించి మెప్పించింది. ఇక గత కొన్ని రోజులుగా పవిత్రా లోకేష్ సీనియర్ నటుడు నరేష్ తో లివింగ్ రిలేషన్ లో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. ఇటీవలే ఈ జంట మహాబలేశ్వరం టెంపుల్ లో పెళ్ళికి సంబంధించిన పనులను కూడా చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. వీటిపై ఆమె ఇంకా స్పందించలేదు. అయితే తాజాగా పవిత్రా లోకేష్ .. బెంగుళూరు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక్షమవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఒక ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసభ్యమైన ఫోటోలు, తన ప్రతిష్టకు భాగం కలిగించే వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటి వలన తనకు ఇబ్బందఫై కలుగుతుందని తెలుపుతూ ఆమె సైబర్ నేరగాళ్లపై ఫిర్యాదు చేసింది. ఇక పవిత్రా ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇకపోతే పవిత్రా లోకేష్ బెంగుళూరులో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసముంటుంది. 2007 లో సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న పవిత్రా మనస్పర్థల కారణంగా అతనికి విడాకులు ఇచ్చి ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే నరేష్ ను ఆమె రెండో వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version