ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ” నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను” అని ట్వీట్ చేసింది నందిత. తాజాగా ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ
నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది. కన్నడ చిత్రం “నంద లవ్స్ నందిత” చిత్రంతో నందిత తన నట జీవితాన్ని ప్రారంభించింది. తరువాత 2012లో కామెడీ చిత్రం “అట్టకతి”తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2016 లో హారర్ కామెడీ చిత్రం “ఎక్కడికి పోతావు చిన్నవాడ”తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
