Mrunal Thakur: ఓ.. సీతా వదలను ఇక కడదాకా.. అంటూ రామ్ అన్నట్లు.. తెలుగు ప్రేక్షకులు కూడా మృణాల్ ఠాకూర్ ను వదలకుండా గుండెల్లో పెట్టేసుకున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మృణాల్ ను అందరు సీత అంటూనే పిలుస్తున్నారు. అంతేకాదు.. మృణాల్ ఎంతగా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు అంటే .. ఆమెపొట్టి బట్టలు వేసుకున్నా, కొద్దిగా అందాల ఆరబోత చేసినా కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మృణాల్ చాలా రోజులు చీరలు, చుడీదార్ ల్లోనే కనిపించింది. కానీ, మృణాల్ లైఫ్ స్టైల్ అది కాదు. ఆమె బాలీవుడ్ నటి. ఫ్యాషన్ ఐకాన్.. నిత్యం మోడ్రన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి మృణాల్.. ఒక్కసారిగా సీతగా మారిపోవడం ఆమె ఉనికికే మచ్చ తీసుకు వచ్చేలా మారింది.
ఇక దీంతో తన ఉనికికి కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది మృణాల్.. తానూ అన్ని పాత్రలకు సెట్ అవుతానని, గ్లామరస్ రోల్స్ తో పాటు అందాల ఆరబోతకు కూడా సై అని హింట్లు ఇస్తోంది. ఇక గత కొన్నిరోజులుగా మృణాల్ అందాల ఆరబోతకు హద్దులేకుండా పోతుంది. బికినీ దగ్గర నుంచి జీన్స్ వరకు అన్ని డ్రెస్ ల్లో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా మృణాల్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది. బ్యాక్ నుంచి ఎద అందాలు చూపిస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం మృణాల్.. నాని 30లో నటిస్తోంది. మరి ఈ సినిమాతో ఈ సీత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.