Meena Sagar: భర్త చనిపోయాక మొదటిసారి అక్కడ కనిపించిన మీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meena Sagar: టాలీవుడ్ సీనియర్ నటి మీనా ఇటీవలే తన భర్తను పోగొట్టుకున్న విషయం విదితమే. ఊపిరితిత్తుల సమస్య తో మీనా భర్త విద్యాసాగర్ ఇటీవలే మృతి చెందాడు. భర్తను కాపాడుకోవడానికి ఆమె ఎంతగానో పోరాటం చేసినా.. ఫలితం దక్కలేదు. ఇక భర్త మరణంతో మీనా కృంగిపోకుండా.. బిడ్డకోసం మళ్లీ నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఆమె తన సినిమా షూటింగ్లను మొదలుపెట్టింది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రంలో మీనా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను కమెడియన్ ఆలీ నిర్మిస్తుండడం విశేషం.
ఇక జూలై 19 న రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే కావడంతో ఆలీ భార్య జుబేదా తన యూట్యూబ్ కోసం ఒక వీడియో తీయగా.. అందులో మీనా కనిపించింది. తన అభిమాన నటిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్న జుబేదా, మీనాతో కొద్దిసేపు ముచ్చటించింది. తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా.. అందరూ ఇదే అడుగుతున్నారని, ఇక నుంచి తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన కెరీర్ లో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా చేయలేదని, ఆ అవకాశం ఇప్పుడు వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!