NTV Telugu Site icon

NTR30: ఏవయ్యా.. కొరటాల.. సినిమా తీస్తున్నావా.. ? సీరియల్ తీస్తున్నావా..?

Ntr

Ntr

NTR30: ఎన్టీఆర్ 30 మీద అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ విలన్, పాన్ ఇండియా రిలీజ్.. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి అప్డేట్ ఏది వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అంటే.. స్టార్ క్యాస్టింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు డైరెక్టర్.. కాన, ఇక్కడ కొరటాల మాత్రం సీరియల్ ఆర్టిస్టులతో కానిచ్చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అవును..వారం రోజుల క్రితం ఎన్టీఆర్ 30 లో సీరియల్ హీరోయిన్ చైత్ర.. సైఫ్ కు భార్యగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడే.. సీరియల్ ఆర్టిస్ట్ ఏంటి..? అని అసహనం వ్యక్తం చేశారు.

Samantha: ఆ విషయంలో సమంత.. అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందా ?

ఇక ఇప్పుడుమరో సీరియల్ ఆర్టిస్ట్ ను ఎన్టీఆర్ 30 లోకి తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నటి మణిచందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించింది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం సీరియల్స్ లో నటిస్తుంది. ఆమెను.. జాన్వీ కపూర్ తల్లిగా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు.. కొరటాల పై ఫైర్ అవుతున్నారు. ఏవయ్యా.. కొరటాల.. సినిమా తీస్తున్నావా.. ? సీరియల్ తీస్తున్నావా..? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే.. కొరటాల క్లారిటీ ఏచెహ్వరకు ఆగాల్సిందే.

Show comments