Son of Kanakadurgamma : భయంకరమైన నిధి అన్వేషణ.. అమ్మవారి ఉగ్రరూపంలో సీనియర్ హీరోయిన్ లయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ లయ సుపరిచితమే. ఒకప్పుడు తనదైన నటనతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై ఎవరూ ఊహించని విధంగా ఓ పవర్ఫుల్ అమ్మవారి అవతారంలో గూస్బంప్స్ తెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘నిధి అన్వేషణ’ (ట్రెజర్ హంట్) అనే అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్‌కు దైవ భక్తిని, యాక్షన్‌ను జోడిస్తూ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. దసరా పండుగ కానుకగా ఈ చిత్రం నుంచి లయ అమ్మవారిగా ఉన్న ఓ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సెన్సేషనల్ పోస్టర్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం. పోస్టర్ చూసిన అనంతరం చిత్రయూనిట్‌కు వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో కేవలం యాక్షన్, అడ్వెంచర్ మాత్రమే కాకుండా లయ అమ్మవారిగా ఉగ్రరూపంలో కనిపించే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఊహించని మలుపులు, గ్రాండ్ విజువల్స్, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో 'జయహో రామానుజ'
అనురూప్ కటారి, లయ, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాగ మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుర్గ ఫణిదర్ లంక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాకర్ల గోవర్ధనరావు కథను అందించారు. సామ్ కే ప్రసన్ పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శశిధర్ లంక సంగీతం, ప్రసాద్ కేవీ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. రాజేష్ లంక యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌పై ఈ ఒక్క పోస్టర్‌తోనే అంచనాలు పెరిగాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను టీమ్ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!