Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా

Surya, Laila

Surya, Laila

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్‌లలో లైలా కూడా ఒకరు. తన అందం, ఎక్స్‌ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్‌తో 90ల ప్రేక్షకుల కలల రాకుమారిగా మారిపోయింది. ముఖ్యంగా ఫ్యామిలీ, రొమాంటిక్, యూత్‌ఫుల్ పాత్రల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసింది. కానీ మంచి కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత నేరుగా ఒక తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘గోదారి గట్టుపైన’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషించారు. మే 8న (ఈరోజే) ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, లైలా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఇంటర్వ్యూలో తన కో-స్టార్లలో ఎవరి మీద క్రష్ ఉంది అని అడగగా.. ఏమాత్రం తడుముకోకుండా “సూర్య” అని సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంటనే నవ్వుతూ.. “ఇది వింటే జ్యోతిక నన్ను చంపేస్తుంది” అని సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి సూర్య, లైలా కాంబినేషన్‌లో వచ్చిన ‘నంద’, ‘ఉన్నై నినైతు’ (తెలుగులో ‘నీ ప్రేమకై’), ‘పితామగన్’ (శివపుత్రుడు) వంటి చిత్రాలు అప్పట్లో క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమని, అందుకే సూర్య పేరు చెప్పానని ఆమె క్లారిటీ ఇచ్చారు.

అలాగేఇక టాలీవుడ్ రీ-ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు కేవలం తల్లి లేదా సోదరి పాత్రలు చేయడం ఇష్టం లేదని లైలా కుండబద్దలు కొట్టారు. వయసుకి తగ్గట్టుగా ఉంటూనే, నటనకు ప్రాధాన్యం ఉన్న బలమైన పాత్రలు వస్తేనే సినిమాలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్తీ నటించిన ‘సర్దార్’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లైలా, ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.