Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్లలో లైలా కూడా ఒకరు. తన అందం, ఎక్స్ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్‌తో 90ల ప్రేక్షకుల కలల రాకుమారిగా మారిపోయింది. ముఖ్యంగా ఫ్యామిలీ, రొమాంటిక్, యూత్‌ఫుల్ పాత్రల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసింది. కానీ మంచి కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత నేరుగా ఒక తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘గోదారి గట్టుపైన’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషించారు. మే 8న (ఈరోజే) ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, లైలా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఇంటర్వ్యూలో తన కో-స్టార్లలో ఎవరి మీద క్రష్ ఉంది అని అడగగా.. ఏమాత్రం తడుముకోకుండా “సూర్య” అని సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంటనే నవ్వుతూ.. “ఇది వింటే జ్యోతిక నన్ను చంపేస్తుంది” అని సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి సూర్య, లైలా కాంబినేషన్లో వచ్చిన ‘నంద’, ‘ఉన్నై నినైతు’ (తెలుగులో ‘నీ ప్రేమకై’), ‘పితామగన్’ (శివపుత్రుడు) వంటి చిత్రాలు అప్పట్లో క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమని, అందుకే సూర్య పేరు చెప్పానని ఆమె క్లారిటీ ఇచ్చారు.
Also Read
అలాగేఇక టాలీవుడ్ రీ-ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు కేవలం తల్లి లేదా సోదరి పాత్రలు చేయడం ఇష్టం లేదని లైలా కుండబద్దలు కొట్టారు. వయసుకి తగ్గట్టుగా ఉంటూనే, నటనకు ప్రాధాన్యం ఉన్న బలమైన పాత్రలు వస్తేనే సినిమాలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్తీ నటించిన ‘సర్దార్’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లైలా, ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?