NTV Telugu Site icon

RK Roja: రోజా ఎవరో తెలీదన్న కంగనా.. రోజా షాకింగ్ రియాక్షన్!

Actress Kangana Ranaut Shocking Comments On Minister Roja

Actress Kangana Ranaut Shocking Comments On Minister Roja

Actress Kangana Ranaut Shocking Comments on Minister Roja: బాలీవుడ్ లో వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చింది. అయితే ఆమె లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2లో చంద్రముఖి అనే టైటిల్ రోల్ లో నటించింది. పి. వాసు దర్శకత్వంలో నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘చంద్రముఖి-2’ చిత్రం ఈ నెల 15న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న క్రమంలో ఆమె వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తాను అసలు సిసలైన దేశభక్తురాలినని, అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని ఆమె రనౌత్ ప్రకటించారు.రాజకీయాల్లో అవకాశం వస్తే వదులుకోనని, తాను దేశభక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞా.. సౌండు లేదెందుకు?

అయితే ఇలా సినిమాలు చేస్తున్న వారు రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏపీ పర్యాటక శాఖ మంత్రి, నటి రోజా కామెంట్స్ చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా దానికి కంగనా షాకింగ్ గా స్పందించింది. అసలు రోజా అంటే ఎవరు? అలాంటి వారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు, ఇక ఆమె గురించి నేనేం మాట్లాడతాను? ” అని అన్నారు. అసలలే ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఎవరో తెలియదని అనడంతో ఈ విషయం రోజా చెవిన పడితే ఆమె అగ్గిమీద గుగ్గిలం అయి కంగనా మీద విరుచుకుపడతారు అని అనుకున్నారు. అయితే రోజా కూడా ఈ విషయం మీద షాకింగ్ గా స్పందించారు. తిరుపతిలో మంత్రి రోజా దృష్టికి మీడియా ఈ విషయాన్ని తీసుకు వెళ్లగా అసలు కంగనా రనౌత్ నేను ఎలా తెలుస్తాను? ఆమె అన్న దానిలో తప్పేముంది అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు రోజా.

Show comments