ఏ సినిమా చూసిన నీతి సారం మాత్రం చెడుపై మంచి గెలవడమే.. ప్రతి సినిమా ముగింపు సమాజ హితం కోసమేనని ఇప్పటికే చాలా సినిమాలు చూపించాయి. అందుకే సినిమా స్టార్స్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాళ్లే బయట చెప్పే మాటలకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమా సీన్ తో తొమ్మిదేళ్ల చిన్నారి తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన తీరు నటి జ్యోతిక మనసును గెలిచింది.
నటి జ్యోతిక తొలిసారి లాయర్ పాత్రలో నటించిన చిత్రం ‘పొన్‌మగళ్ వందాళ్’.. సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఓ కేసులో నిజాయతీపరురాలైన లాయర్ వెన్బా (జ్యోతిక) ఎలా వాదించాల్సి వచ్చింది? న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ కేసును ఎలా నీరుగార్చారు. చివరకు వరుస హత్యల వెనుక నిజానిజాలను జ్యోతిక ఎలా బయటపెడుతుందన్నదే ఈ కథ..
ఈ సినిమాలో జ్యోతిక కోర్టు సీన్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఓ సీన్ లో ‘పిల్లలు ఏ విషయాన్ని తమ పేరెంట్స్ వద్ద దాచకూడదు’ అనే సీన్ ని చూసిన చిన్నారి.. తనపై లైంగిక దాడి గురించి వెంటనే మదర్ కు వెల్లడించింది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోని ఆ చిన్నారి, ఆ సీన్ చూడగానే కుటుంబసభ్యుల్లోని ఓ వ్యక్తే తనను ఎలా వేధించాడో బయటపెట్టింది. పేరెంట్స్ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయాన్ని జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి. ప్రతిసారీ ఒక మహిళ తనకు తానే అండగా నిలుస్తుందంటూ పోస్ట్ చేసింది.
A post shared by Jyotika (@jyotika)
