Actress Jyothi Gives Clarity on KP Chowdary Drugs Case: నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత.. ఎంతోమంది నటీమణుల పేర్లు తెరమీదకి వచ్చాయి. ఆ జాబితాలో నటి జ్యోతి ఒకరు. కేపీ చౌదరితో చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటో లభ్యం కావడంతో.. డ్రగ్స్ వ్యవహారంలో ఆమె హస్తం కూడా ఉండొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని జ్యోతి క్లారిటీ ఇచ్చారు. కేపీ చౌదరి తనకు మంచి స్నేహితుడే కానీ, డ్రగ్స్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దయచేసి నిజానిజాలు తెలుసుకొని, ఫోటోలు వేయాలని కోరారు. నేరస్తులను సైతం ముఖాలను కవర్ చేసి ఫోటోలు వేస్తారని.. కానీ నిజానిజాలు నిర్ధారించుకోకుండా, లేడీస్ ఫోటోలను ఇలా టీవీల్లో వేయడం చాలా తప్పు అని అన్నారు. ఇలా ఫోటోలు వేయడం తనని ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Adipurush: నీ నామస్మరణ మహిమాన్వితం రామా…
కేపీ చౌదరితో తమకు ఫ్యామిలీ బాండింగ్ ఉందే తప్ప.. ఈ డ్రగ్స్ కేసుతో ఏమాత్రం సంబంధం లేదని నటి జ్యోతి స్పష్టం చేశారు. కావాలంటే.. తన ఫోన్ లిస్ట్ కూడా చెక్ చేయొచ్చని, తన ఫోన్ డేటా మొత్తం ఇవ్వడానికి కూడా సిద్ధమని, తాను ఎలాంటి కాల్ డీటెయిల్స్‌ని తొలగించలేదని అన్నారు. అమ్మాయిల పేర్లు రాగానే అందరి ఫోటోలు వేశారని.. మరి అబ్బాయిల పేర్లు గానీ, ఫోటోలు గానీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అమ్మాయిలంటే అంత ఈజీ టార్గెటా? ఎంత సెలెబ్రిటీ ఫేమ్ ఉంటే మాత్రం ఫోటోలు వేసేస్తారా? అని నిలదీశారు. తాను నార్కొటిక్ టెస్ట్‌కి కూడా సిద్ధంగా ఉన్నానని.. డ్రగ్స్ కాదు కదా, తాను మద్యం కూడా సేవించనని, ఎప్పుడో ఒకసారి మాత్రం మద్యం సేవిస్తానని పేర్కొన్నారు. అయినా.. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని అన్నప్పుడు, తన ఫోటోలను టీవీల్లో వేయడానికి ఎవరు అర్హత ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వకముందే, నేను తప్పు చేశానని మీరెలా నిర్ధారిస్తారు? అని కడిగిపారేశారు. ఇలా చేయడం వల్ల తమ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుందని అన్నారు.
Kajal Agarwal : ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తున్న కాజల్.
తనకు ఎలాంటి భయం లేదని, తానెప్పుడూ అందుబాటులోనే ఉంటానని, పోలీసులు విచారణకు పిలిచినా తాను సహకరిస్తానని జ్యోతి వెల్లడించారు. సిక్కిరెడ్డి ఇంట్లో కేపీ చౌదరి నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో కూడా తాను పాల్గొనలేదని, కావాలంటే ఫుటేజీలు చెక్ చేసుకోవాలని చెప్పారు. గత రెండు రోజుల నుంచి తన ఫోటోలను టీవీల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం చూసి.. తాను చాలా డిస్ట్రర్బ్ అయ్యానని అన్నారు. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, అసలు ఆ అవసరం కూడా లేదని చెప్పుకొచ్చారు. దయచేసి తన ఫోటోలను సర్క్యులేట్ చేయొద్దని, ఈ కేసుతో లింక్ పెడుతూ తప్పుడు వార్తలు రాయొద్దని జ్యోతి కోరారు.