టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని ఈరోజు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నానని నటి తెలిపింది. ఈ 37 ఏళ్ల బ్యూటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 3 బారిన పడింది. ఆమె ఇప్పుడు పూణేలో నివసిస్తోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి హంసా నందిని నాలుగు నెలల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశకు గురైంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు బయటపడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్‌తోనే మరణించడం గమనార్హం. తల్లి తరువాత హంసకు క్యాన్సర్ రావడం అంటే వంశపారంపర్యంగా వస్తుందన్నమాట.
Read Also :
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలలో హంసా నందినికి BRCA1 పాజిటివ్ అని తేలింది. తల్లిని కోల్పోయిన ఆమె ఆ బాధ నుంచి ఇంకా బయట పడకముందే హంసకు క్యాన్సర్ ఉన్నట్లు తెలియడం బాధాకరం. విషయం తెలిసినప్పటికీ హంసా నందిని ధైర్యంగా ఉంటూ క్యాన్సర్ కు తగిన చికిత్స చేయించుకుంటోంది. చికిత్సలో భాగంగా హంస ప్రస్తుతం కీమోథెరపీలో ఉంది. ఇక తాజాగా హంసకు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె గుండు చేయించుకున్నట్టుగా కన్పిస్తోంది. అభిమానులు హంస త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Read Also :
కాగా హంసా నందిని పలు తెలుగు సినిమాల్లో నటించింది. గోపీచంద్ ‘లక్ష్యం’, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో కన్పించి మెప్పించింది. ఇక మహేష్ బాబుతో కలిసి వెండితెరపై కొన్ని క్షణాలైనా కన్పించాలనే ఆశను ఇటీవలే వ్యక్తం చేసింది హంస.
