Site icon NTV Telugu

Divya Sridher: మరో నటితో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీరియల్ నటి

Divya

Divya

Divya Sridher:కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య. ఇక ఈ సీరియల్ తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కేలాన్ కన్మణి సీరియల్ లో తనతో పాటు నటించిన ఆర్నావ్ తో ఆమె ప్రేమలో పడింది. కొన్నేరోజులు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టారు. అయితే ఆర్నావ్ కొన్ని నెల్లలు బాగానే ఉన్నా ఆ తరువాత మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం దివ్యకు తెలియడంతో అందరి ముందు భర్తను నిలదీసి తమ పెళ్లిని లీగల్ చేస్తూ గుళ్లో మరోసారి పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత కూడా ఆర్నావ్ లో ఎలాంటి మార్పు రాలేదు. మరో నటితో రాసలీలలు చేస్తూ దివ్య కంటపడ్డాడు. దీంతో ఆమె మరోసారి అతడిని నిలదీయడంతో అతడు ఎదురుతిరిగాడు. ఆమెను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి ప్రయత్నించడంతో ఆమె పోలీసుల సాయం కోరింది. తన భర్త వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవాలనిచూస్తున్నాడని, అతని వలన తనకు, తన బిడ్డకు ప్రాణ హాని ఉన్నదని ఫిర్యాదు లో తెలిపింది. ఇక దివ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం దివ్య అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

Exit mobile version