NTV Telugu Site icon

Disha Patani: కోల్డ్ క్లైమేట్ లో హాట్ ఫోటోస్…

Disha Patani

Disha Patani

అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ ‘దిశా పటాని’. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాలో గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన దిశా పటాని, ‘ధోని’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీలో పూర్తిగా హోమ్లీ లుక్ లో కనిపించిన దిశా, నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత దిశా చేసిన సినిమాలన్నీ గ్లామర్ డోస్ నిండినవే. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న దిశా పటాని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోస్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.

హాట్ ఫోటో షూట్స్ చేయడం, టూ పీస్ డ్రెస్సుల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడంలో దిశా పటాని దిట్ట. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా యూత్ లో దిశా క్రేజ్ తగ్గకపోవడానికి కారణం, ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్. బికినీ ఫోటోలని కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేసే దిశా పటాని తాజాగా ‘పింక్ ఫ్లోరల్ డిజైన్ బికినీ’ వేసుకోని స్విమ్మింగ్ పూల్ లోకి దిగింది. చల్లని వాతావరణంలో వేడి పెంచడానికా అన్నట్లు, స్విమ్మింగ్ పూల్ నుంచే దిశా పటాని బికినీ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఫాలోవర్స్ అంతా రీట్వీట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’, సూర్యా నటిస్తున్న ‘సూర్య 42’ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకేక్కుతున్నవే కావడం విశేషం.

Show comments