NTV Telugu Site icon

కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు..? భూమిక సంచలన వ్యాఖ్యలు

bhoomika

bhoomika

భూమిక చావ్లా.. యువకుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఖుషి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువతారా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన అమ్మడు యోగా టీచర్ భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బై బై చెప్పింది. ఇక ఇటీవల అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ‘ఎంసిఎ’, ‘సవ్యసాచి’, ‘పాగల్’, ‘సీటిమార్’ చిత్రాలలో అమ్మ, అక్క పాత్రలో నటించి మెప్పించిన భూమిక క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న భూమిక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ “కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయా..? నిర్మాతలతో ఎప్పుడు టచ్ లో ఉండాలా..? అవన్నీ అవాస్తవాలు.. నన్నెవరూ అలాంటివి అడగలేదు.. కథ నచ్చి, ఆ పాత్రకు నేనే బాగుంటాను అంటే నాకోసం ముంబై వచ్చి మరి మాట్లాడేవారు” అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎంతోమంది తాము క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామని బాహాటంగానే చెప్తున్న తరుణంలో భూమిక మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం భూమిక పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Show comments