NTV Telugu Site icon

Alia Bhatt Mother: ఇల్లీగల్ డ్రగ్స్ స్కామ్‌లో అలియా భట్ తల్లి?

Alia Bhatt Mother

Alia Bhatt Mother

Actress Aliaa Bhatt Mother Soni Razdan Got Scam Call Talking About Illegal Drugs : టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయి. రోజుకో కొత్త తరహా మోసాలు తెర మీదకు వస్తున్నాయి. దీని నుంచి సామాన్యులు, సెలబ్రిటీలు కూడా తప్పించుకోలేక పోతున్నారు. తాజా ఒక సైబర్ క్రైమ్ కేసులో ప్రముఖ నటి అలియా భట్ తల్లిని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పోస్ట్‌ను ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ హైటెక్ ప్రపంచంలో మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా అప్‌గ్రేడ్ అయ్యారు. రోజుకో కొత్త ట్రిక్ అవలంబిస్తూ మనుషులను వేటాడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు అలియా తల్లి సోనీ రజ్దాన్‌ను మోసం చేయడానికి ప్రయత్నించారని తెల్సింది. ఈ రోజుల్లో పెద్ద స్కామ్ జరుగుతోందని సోనీ రజ్దాన్ వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ లేదా కస్టమ్స్ అధికారి అని చెప్పుకునే వ్యక్తి మీరు కొన్ని అక్రమ డ్రగ్స్ ఆర్డర్ చేశానని చెప్పాడు, అనంతరం బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడని ఆమె వెల్లడించింది.

Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!

సోనీ రజ్దాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు, అందులో ‘భారీ స్కామ్ జరుగుతోంది. ఎవరో ఫోన్ చేసి, ఢిల్లీ కస్టమ్స్‌ అధికారిగా నటిస్తూ, మీరు కొన్ని చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఆర్డర్ చేశారని చెప్పారు. ఆ వ్యక్తులు తమను తాము పోలీసుగా లేదా అలాంటి అధికారులుగా చెప్పుకుంటారు. ‘దీని తర్వాత వారు మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నాకు కూడా అలాంటి కాల్ వచ్చింది. ఆ తర్వాత భారీ మొత్తాన్ని బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తారు, ఓవరాల్ పాయింట్ ఏమిటంటే, మనం వారి ఉచ్చులో పడకూడదు, ఎవరి ఉచ్చులో చిక్కుకున్నా, అది పీడకల కంటే ఏమాత్రం తక్కువ కాదు. అదృష్టవశాత్తూ, అతను నన్ను ఆధార్ కార్డ్ వివరాలు అడగగానే, నేను అతనికి మళ్ళీ చెబుతానని చెప్పి కట్ చేశారు. వారు మళ్లీ కాల్ చేయలేదు, కానీ అది చాలా భయానకంగా ఉంది. మీకు అలాంటి కాల్స్ వచ్చినప్పుడు, ఈ నంబర్లను పోలీసులకు ఇవ్వండి. గత కొన్ని వారాల్లో ఇలాంటి కాల్స్ నాకు తెలిసిన ముగ్గురు వ్యక్తులకి వచ్చాయి అని ఆమె పేర్కొంది.