NTV Telugu Site icon

Akshara Haasan: కమల్ కూతురా.. మజాకానా.. రూ.15.75 కోట్లతో ఇల్లు అంటే మాటలా..?

Akshara

Akshara

Akshara Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతుర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కూతురు శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తోంది. ఇక రెండో కూతురు అక్షర హాసన్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేదనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మను కూడా స్టార్ హీరోయిన్ గా చూడాలనుకున్నాడు కమల్. కానీ, శృతికి వచ్చినంత గుర్తింపు అక్షర అందుకోలేకపోయింది. తెలుగులో కాకుండా.. తమిళ్ లో అక్షర.. తనకంటూ ఒక గుర్తింపును అందుకుంది. ఇక సినిమాలతో కాకుండా ఈ భామ కొన్ని వివాదాల ద్వారా ఫేమస్ అయ్యింది. ఒకానొక సమయంలో అక్షర ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడంతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది.

Eswar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత

ఇక తాజాగా అక్షర మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ భామ ముంబైలో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ను కొనుగోలు చేసింది. దాని విలువ ఏకంగా రూ.15.75 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఆ ఇల్లు కొనుగోలు చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో దాదాపుగా కోటి రూపాయల స్టాంప్ డ్యూటీ ని చెల్లించిందని సమాచారం. ఇక ఆ ఇంటి ఇంటీరియర్ కోసం మరో రెండు కోట్లు ఖర్చుపెట్టిందట.. మొత్తం కలిపి ఆ ఇంటి కోసం దాదాపు రూ.15.75 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో అభిమానులు.. తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కమల్ కూతురా.. మజాకానా.. అని కొందరు.. అమ్మడు ఏ రేంజ్ లో సంపాదిస్తే.. ఈ రేంజ్ లో ఇల్లు కొంటుంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.