Site icon NTV Telugu

నటుడు విజయ్ సేతుపతిపై దాడి..?

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి ఆయనపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ పీఏతో గొడవకు దిగగా వారు వారించారని, దీంతో అతను కోపంతో విజయ్ సేతుపతి పీఏపై దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత అతను విజయ్ బృందానికి సారీ చెప్పడంతో వివాదం ముగిసిందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేయవద్దని విజయ్ సేతుపతి తెలిపినట్లు తెలుస్తోంది. వీడియోలో విజయ్ సేతుపతి, అతని టీమ్ నడుస్తుండగా వెనక నుంచి ఒక వ్యక్తి బలంగా విజయ్ సేతుపతి పీఏని తోసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

https://twitter.com/frankklinkumar/status/1455896649373347848?s=20
Exit mobile version