NTV Telugu Site icon

Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు

Uppi

Uppi

Upendra: కన్నడ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన నటించిన సినిమాల్లో కూడా అలానే కనిపిస్తాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఉపేంద్ర ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం కూడా తెల్సిందే. దాని పేరు ప్రజాక్రియా. ఈ పార్టీ ఆఫీస్ లోనే ఉపేంద్ర తన రాజకీయ ప్రసంగాలు.. ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఉపేంద్రకు వివాదాలు కొత్తేమి కాదు. చాలా సార్లు ఆయన మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడం.. తరువాత సారీ చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈసారి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కోర్టు కేసు వరకు వెళ్లాయి. అసలు విషయం ఏంటంటే.. ప్రజాక్రియా పార్టీ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉపేంద్ర ఒక ఫేస్ బుక్ లైవ్ ను ఏర్పాటు చేసి తన పార్టీ సభ్యులతో పాటు.. అభిమానులతో కూడా మాట్లాడాడు. అందులో విపక్షాలపై విమర్శలు గుప్పించాడు.

Sadha: సెట్ లో దాన్ని చూసి గావుకేకలు పెట్టిన సదా..

ఇక పొరపాటున విపక్షాలను తిడుతూ.. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారు, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారు అంటూ నోరు జారాడు. ఇక దళితులను అంత నీచంగా మాట్లాడతాడా అంటూ దళిత సంఘాలు ఉపేంద్రపై కేసు నమోదు చేసాయి. దీంతో వెంటనే నాలుక్కర్చుకున్న ఉపేంద్ర దళితులకు సారీ చెప్పి.. ఆ వీడియోను డిలీట్ చేసాడు. అయినా దళిత సంఘాలు వదలలేదు.ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక ఈ కేసుపై కోర్టు స్టే ఇవ్వడంతో ఉపేంద్రకు కొద్దిగా ఊరట లభించింది. ఉపేంద్రపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఇది ఇప్పటికి తాత్కాలికమే అయినా ఈ కేసు నుంచి బయటపడడం అంత ఈజీ కాదని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఉపేంద్ర ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.