Site icon NTV Telugu

Big Breaking: స్టార్ హీరో శింబు తండ్రికి హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం

Simbu

Simbu

కోలీవుడ్ సీనియర్ నటుడు టి రాజేందర్ కు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్నీ ఆయన కొడుకు, హీరో శింబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. “నా అరుయిర్ అభిమానులకు మరియు ప్రియమైన పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారం. మా నాన్నకు ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ పరీక్ష చేయగా పొత్తికడుపులో స్వల్ప రక్తస్రావం కావడంతో వైద్యులు త్వరగా చికిత్స అందించాలని సూచించారు. అందువలన ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళుతున్నారు.

ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారు.వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ ముగించుకొని మళ్లీ మీ అందరిని కలవడానికి తిరిగి వస్తారు. మీ ప్రార్థనలకు మరియు అందరి ప్రేమకు ధన్యవాదాలు” అని శింబు ప్రకటన ద్వారస్ తెలిపారు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజేందర్ కు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను అభిమానులు ఉన్నారు. ఆయన నట వారసుడిగా అడుగుపెట్టిన శింబు లో తెలుగులో కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవలే ‘మానాడు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

Exit mobile version