Site icon NTV Telugu

Suresh Gopi: లేడీ జర్నలిస్ట్ పై నటుడు అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

Suresh

Suresh

Suresh Gopi: మలయాళ నటుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. ఎక్కువ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే.. విక్రమ్ నటించిన ఐ మూవీలో విలన్ గా నటించింది సురేష్ గోపినే. ప్రస్తుతం ఆయన మంచి సినిమాల్లో నటిస్తూనే.. ఇంకోపక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నాడు. ఇకపోతే నార్త్‌-కొయ్‌కోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ గోపీ ఒక లేడీ జర్నలిస్ట్ పై అసభ్యంగా ప్రవర్తించాడు. కార్యక్రమం అనంతరం ఆయన పలువురు జర్నలిస్ట్‌లతో మాట్లాడారు.

Manchu Vishnu: బిగ్ బ్రేకింగ్.. కన్నప్ప షూటింగ్ లో మంచు విష్ణుకు ప్రమాదం

ఇక ఈ క్రమంలోనే తన పక్కన ఉన్న ఓ మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన సదరు లేడీ జర్నలిస్ట్ కాస్త దూరం జరిగింది. అనంతరం, మరో ప్రశ్న అడిగేందుకు ఆమె ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను తాకుతుండగా..ఆమె, ఆయన చేతిని తీయడానికి ప్రయత్నించింది. అయినా కూడా చేతిని వేశాడు.ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును తప్పుబట్టారు. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ పెట్టాడు. కూతురి పట్ల వాత్సల్యం చూపించినట్టుగానే తాను అలా చెయ్యి వేశానని, ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా.. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version