NTV Telugu Site icon

Srikanth: స్టేజిపై చెప్పులు వస్తాయి.. థమన్ ను ఇంతలా అవమానిస్తావా.. బ్రో ?

Srikanth

Srikanth

Srikanth: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. అఖండ లాంటి భారీ విజయం అందుకున్నాక.. బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే గతరాత్రి స్కంద ప్రీ రిలీజ్ థండర్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను మేకథిస్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో బోయా మార్క్ కనిపించింది. ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ ను బట్టి ఆయన పాత్ర కీలకమని తెలుస్తుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం శ్రీకాంత్ స్టేజిపై మాట్లాడుతూ.. థమన్ గురించి మాట తూలాడు. అది తూలడం కాదు.. పొరపాటున వచ్చేసిన డైలాగ్ అనే చెప్పాలి. కానీ, దాంతో నెటిజన్స్ థమన్ ను, శ్రీకాంత్ ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు.

NTR: తారక్ మాటే నా మాట అంటున్న బాలయ్య..

శ్రీకాంత్ థమన్ గురించి మాట్లాడుతూ.. ” థమన్ గురించి నేను చెప్పాలి.. ఎందుకంటే అతను మంచి సంగీత దర్శకుడు. అఖండలో మీరు చూశారు.. ఎంత అద్భుతమైన మ్యూజిక్ ను ఇచ్చారు అనేది. అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్లు కొడుతూ ఉంటాడు.. ప్రేక్షకుల్లో నుంచి విజిల్స్ .. చెప్పుల్స్ వస్తాయి అని వెంటనే తేరుకొని చప్పట్లు వస్తాయి” అని చెప్పుకొచ్చాడు. అయితే అది శ్రీకాంత్ కావాలని చేసింది కాదు.. పొరపాటున వచ్చేసింది… అంతమంది ముందు మాట్లాడుతుంటే ఎవరికైన కొద్దిగా టెన్షన్ ఉంటుంది. ఆయా టెన్షన్ వలనే ఇలా జరిగి ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తుండగా.. థమన్ ఫ్యాన్స్ మాత్రం థమన్ ను ఇంతలా అవమానిస్తావా.. బ్రో ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Actor Srikanth Speech At Skanda Pre Release Event | Ram Pothineni | Ntv ENT