NTV Telugu Site icon

Siddharth: సిద్దార్థ్ ప్రెస్ మీట్ ను అడ్డుకున్న నిరసన కారులు.. నవ్వుతూ వెళ్ళిపోయిన హీరో

Sid

Sid

Siddharth: బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్రస్తుతం హీరోగా మంచి హిట్ కోసం యంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఒక సున్నితమైన కథతో రానున్నాడు. సిద్దార్థ్, నిమిషా సాజయాన్ జంటగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిత్తా. తెలుగులో చిన్నా అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన, టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక కూతురు కోసం ఒక తండ్రి చేసే పోరాటమే చిన్నా కథగా తెలుస్తోంది. ఈ సినిమాపై సిద్దార్థ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సిద్దార్థ్ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ హీరో.. కన్నడ ప్రమోషన్స్ లో భాగంగా.. బెంగుళూరు మీడియాతో ప్రెస్ మీట్ ను నిర్వహించాడు. అయితే ప్రెస్ మీట్ మొదలవ్వకుముందే కొంతమంది నిరసన కారులు.. అక్కడకు వచ్చి ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు.

Leo Second Single: మొన్న టైగర్ కా హుకుమ్.. నేడు బ్యాడ్ యాస్ .. అదిరిందయ్యా అనిరుధ్

కర్ణాటకలో కావేరీ నది జలాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్న విషయం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5,000 క్యూసెక్కుల జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రక్షణ వేదిక ప్రతినిధులు ఇప్పటికే బెంగళూరులో బంద్ పాటించారు. శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సిద్దార్థ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టడంతో ఆగ్రహించిన నిరసన కారులు ఆ ప్రెస్ మీట్ ను అడ్డుకొని సిద్దార్థ్ ను వెళ్లిపొమ్మని సూచించారు. అతను ఏం చెప్పినా వారు వినలేదు. దీంతో నిరసన కారులు బలవంతం చేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. నిరసనకారులు ఎంత కోపంగా మాట్లాడినా కూడా సిద్దార్థ్ నవ్వుతూ సమాధానమిస్తూ వెళ్లిపోవడం చాలా గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments