బాహుబలి ‘కట్టప్ప’ ఇంట్లో విషాదం..

satyaraj

satyaraj

నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్‌ సతీమణి కల్పన కన్నుమూశారు. గతకొద్దికాలంలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏ. కల్పన సత్యరాజ్ కి రెండో చెల్లెలు.. ఆమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివసిస్తున్నారు.

చెల్లెలి మరణ వార్త విన్న సత్యరాజ్ కుటుంబం హుటాహుటిన తిరుప్పూరుకి చేరుకున్నారు. ఇకపోతే తమిళ్ నటుడిగా పేరు గాంచిన సత్యరాజ్ తెలుగులోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు.