NTV Telugu Site icon

Subrahmanyaa: మరో వారసుడు వస్తున్నాడు.. ఆ ‘సుబ్రమణ్య’మే కాపాడాలి!

Actor Ravi Shankar Son Advays Debut Movie Titled Subrahmanyaa

Actor Ravi Shankar Son Advays Debut Movie Titled Subrahmanyaa

Actor Ravi Shankar Son Advays Debut Movie Titled Subrahmanyaa: ఇప్పటికే అనేక పరిశ్రమల్లో వారసుల ఎంట్రీ కామనే, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ ‘బొమ్మాళి’ రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను గతంలో గుణ 369 సినిమాను రూపొందించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ “సుబ్రహ్మణ్య”ని నిర్మించనున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామ లక్ష్మి సమర్పిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ దసరా రోజున రిలీజ్ చేశారు. ఇక సుబ్రహ్మణ్య పోస్టర్‌లో కొన్ని విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పోస్టర్ సూచించినట్లుగా సినిమాలో డివోషినల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అతని వాహనం నెమలిని చూపడం చూస్తే ఇట్టే అర్ధం అయిపోతోంది. ఇక పోస్టర్ లో అద్వయ్ స్టైలిష్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు.

Lokesh Kanagaraj: ప్రమోషన్స్ లో అపశృతి.. లియో డైరెక్టర్ కి గాయాలు?

ఖాకీ దుస్తులు ధరించి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో రహస్యంగా కనిపించే పుస్తకంతో ఆయన కనిపిస్తున్నారు. కథకు హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ డిమాండ్ ఉందని, సినిమాను బిగ్ స్క్రీన్‌లపై దీన్ని చూడటం ఒక కన్నుల పండువగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాజ్ తోట డీవోపీగా పని చేస్తుండగా, కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మస్తీ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం కుమార్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు ఉల్లాస్ హైదూర్ (చార్లీ 777/ సప్త సాగరదాచే ఎల్లో) ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవరిస్తున్న ఈ సుబ్రహ్మణ్య పాన్-ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే సాయి కుమార్ తర్వాత ఆయన సోదరులు అయ్యప్ప శర్మ, రవి శంకర్ నటులుగా నిలదొక్కుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తున్నా ఎందుకో హిట్లు పట్టలేకపోతున్నారు. మరి ఈ కుర్రాడు ఎంతమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.