NTV Telugu Site icon

Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..

Rakshith

Rakshith

Rakshit Shetty: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగులో అతను డైరెక్ట్ గా మూవీ చేయకపోయినా.. నేషనల్ క్రష్ రష్మిక.. నిశ్చితార్థం చేసుకొని క్యానిస్ల చేసిన పెళ్లి కొడుకుగా తెలుగువారికి బాగా సుపరిచితుడు రక్షిత్. ఇక ఈ ఘటన తరువాత.. రక్షిత్ తన సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం మొదలుపెట్టాడు. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా హిట్ అందుకున్నాడు. అప్పటినుంచి అతడి ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తుంది. గతేడాది 777 ఛార్లీ తో హిట్ అందుకున్న రక్షిత్.. ఈ ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ A అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హేమంత్.ఎం.రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి ఆదరణనే అందుకుంది. ఇక సప్తసాగరాలు దాటి సైడ్ B నవంబర్ 17 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోన ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

Salaar: డైనోసర్ ల్యాండ్ అయ్యాడు.. ఇంకా మొదలెట్టరేంటి.. ?

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో రక్షిత్ తన జీవితంలో మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ” నేను ఇంజినీరింగ్ సెకండియర్‌ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూశా. చాలా రోజులు తిరిగి తనకి లవ్ లెటర్ రాసి.. ఇద్దామనుకున్నా.. నేను హాస్టల్ లో ఉండేవాడిని. ఆమె బస్సులో వచ్చేది. దీంతో అదే బస్సులో వచ్చే నా ఫ్రెండ్ కు ఆ లెటర్ ఇచ్చి.. తనకు ఇవ్వమని చెప్పాను. లెటర్ ఇచ్చాకా కూడా ఆమెలో ఎలాంటి ఫీలింగ్ నాకు కనిపించలేదు. అలా చాలాసార్లు లెటర్ ఇవ్వడం.. ఆమె చూడకపోవడం ఇలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ, ఆమెనుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. నా కాలేజ్ అయిపోయాక నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్‌ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు వారిద్దరూ భార్యాభర్తలు” అని చెప్పడంతో పక్కన ఉన్న హీరోయిన్స్ తో పాటు యాంకర్ కూడా షాక్ అయ్యి నవ్వడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments