Site icon NTV Telugu

ప్రకాశ్ రాజ్ కి గాయం! అన్నీ మంచి శకునములే!!

జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కాలికి గాయమైంది. పొరపాటున జారి పడటంతో కాలికి చిన్నపాటి ఫ్యాక్చర్ అయ్యిందని స్వయంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి చేత సర్జరీ చేయించుకోవడానికి విమానంలో హైదరాబాద్ కు బయలు దేరినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. కంగారు పడాల్సింది ఏమీ లేదని, తాను బాగానే ఉన్నానని ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను వచ్చే నెల రెండోవారం నిర్వహించమని చిరంజీవితో సహా పలువురు కార్యవర్గ సభ్యులు కోరుతున్న సమయంలోనే ప్రకాశ్ రాజ్ కాలికి ఫ్యాక్చర్ కావడం, ఆయన ఆపరేషన్ చేయించుకోనుండటం శుభ సూచకమే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు మమతా బెనర్జీ ఇలానే కాలికి ఫ్యాక్చర్ కావడంతో వీల్ ఛైర్ నుండే ప్రచారం చేసి, అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. సో… ఎన్నికలు జరిగితే ‘మా’ పీఠం సైతం ప్రకాశ్ రాజ్ దే అని వీరంతా భావిస్తున్నారు.

Exit mobile version