NTV Telugu Site icon

Adhik Ravichandran: స్టార్ హీరో కూతురితో ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ పెళ్లి.. ?

Prabhu

Prabhu

Adhik Ravichandran: మార్క్ ఆంటోనీ సినిమాతో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ కు ఎన్నో ప్లాపుల తరువాత అధిక్ హిట్ ఇవ్వడంతో కోలీవుడ్ మొత్తం అతనిపైనే కన్నేసింది. ఒక్క కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా అధిక్ ను రమ్మని పిలుస్తోంది. ఇకఈ సినిమా విజయంతో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఛాన్స్ పట్టేశాడు. అజిత్ హీరోగా.. ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కనుక సెట్ అయితే టాప్ డైరెక్టర్స్ లో అధిక్ ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. అధిక్ పెళ్లి వార్త కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి.

Pragathi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన నటి ప్రగతి.. పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం

సీనియర్ హీరో ప్రభు కూతురు ఐశ్వర్యతో అధిక్ పెళ్లి జరగబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక సినిమా సెట్ లో అధిక్, ఐశ్వర్య కలుసుకున్నారని, అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సమాచారం. ఇక ఈ మధ్యనే వీరి పెళ్ళికి ఇరు కుటుంబ వర్గాలు ఓకే చెప్పారని, డిసెంబర్ లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐశ్వర్య ప్రభుకు ఇది రెండో వివాహం. 2009 లో ఆమెకు కునాల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన వారు కొన్నేళ్ళకే విడిపోయారు. ప్రస్తుతం ఐశ్వర్య ప్రభు.. తండ్రి దగ్గరే నివసిస్తుంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.