NTV Telugu Site icon

Nikhil: కార్తికేయ 3 చేయకపోతే ఆమె నన్ను వదలదు

Nikhil

Nikhil

Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఇక హిందీలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి రికార్డు కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది. దీంతో ఈ సినిమాకు కంటిన్యూ గా కార్తికేయ 3 ఎప్పుడు వస్తుంది..? అసలు ఇంకో పార్ట్ ఉందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ నిఖిల్ దీనిపై స్పందించి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఖచ్చితంగా కార్తికేయ 3 ఉండబోతుందని చెప్పి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

కార్తికేయ 3 చేయకపోతే అభిమానులు ఊరుకున్నా తన తల్లి మాత్రం వదలదని చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ ” కార్తికేయ హిట్ తరువాత సీక్వెల్ ఉంటుందని నేను అనుకోలేదు. కానీ, నేను ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు అని అడిగేవారు. దీంతో కార్తికేయ 2 వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 3 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇక ఈ సినిమా చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే కార్తికేయ 3 మొదలు కానుందని ఇప్పటికే డైరెక్టర్ చందు మొండేటి హింట్ ఇచ్చిన విషయం విదితమే.. మరీ ఈసారి ఈ కాంబో ఎలాంటి కథతో రానున్నదో చూడాలి.