టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే నేడు నటుడు నవదీప్ న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరైయ్యారు. ఆయనతో పాటే ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ సైతం ఈడీ విచారణకు హాజరైయ్యారు.
అయితే ఇదివరకు విచారణకు హాజరైన వాళ్ళతో పోలిస్తే, నవదీప్ విచారణ కాస్త ఎక్కువే జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. అయితే నవదీప్ ను ఈడీ అధికారులు ఒత్తిడి పెంచే ప్రశ్నలు అడగటానికి ప్రధానమైన కారణం ఎఫ్ క్లబ్ వ్యవహారమే.. సెలెబ్రిటీలందరు వీకెండ్ లో ఇదే పబ్ కు ఎక్కవగా వస్తుంటారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో నవదీప్ కు వున్నా సంబంధాలు ఈడీ అడిగి తెలుసుకోనుంది.
అలాగే, పబ్ వచ్చే సెలెబ్రిటీస్ అలవాట్లపై కూడా నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎంను ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశంపైనే కూడా విచారణ జరగనుంది. గతంలో ఎక్సైజ్ కేసులో నవదీప్ విచారణకు హాజరయ్యారు. గతంలో 11 గంటల పాటు నవదీప్‌ను ఎక్సైజ్ శాఖ విచారించింది.
