సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటనను కనపరిచే టాప్ 10 నటులలో నాజర్ ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా , సపోర్టింగ్ క్యారెక్టర్ గా.. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన నాజర్ ఇక నుంచి సినిమాలలో కనిపించరు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి.. ఆయనకు ఏమైంది.. ఎందుకు సినిమాలలో కనిపించరు అంటే.. ఇకనుంచి నాజర్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారట.. ఈ సడెన్ రిటైర్మెంట్ ఇప్పుడు తీసుకున్నది కాదని ఎన్నో ఏళ్ళ క్రితమే అనుకున్నా దర్శకులు నాజర్ ను పట్టుబట్టి సినిమాలను చేయిస్తున్నారని ఒక వార్త కూడా వినిపిస్తుంది. అయితే నాజర్ ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలి అనుకుంటున్నారు అంటే.. అందుతున్న సమాచారం ప్రకారం నాజర్ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో ఆయనకు వైద్యులు రెస్ట్ అవసరమని చెప్పారట. దీంతో కుటుంబ సభ్యులు సినిమాలకు దూరంగా ఉండి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఒత్తిడి పెడుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తరువాత పర్మినెంట్ గా ఇంటికే పరిమితమవ్వనున్నారట. అయితే ఈ వార్త చిత్ర పరిశ్రమకు చేదు వార్తే అని చెప్పాలి.. ఎంతమంది నటులు వచ్చినా నాజర్ లాంటి నటుడును, ఆయనలాంటి నటనను మరిపించడం కష్టమైన పని. ఒక వేళ ఈ వార్తే కనుక నిజమైతే ఒక గొప్ప నటుడుని చిత్ర పరిశ్రమ కోల్పోయినట్లే అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క ఆయన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే నాజర్ నోరు విప్పెవరకు ఆగాల్సిందే.
