NTV Telugu Site icon

Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే

Naresh

Naresh

Pavitra Lokesh: టాలీవుడ్ జంట పవిత్ర లోకేష్- నరేష్ కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది. తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, తమ పరువుకు భాగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీనిపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఇక ఆ తరువాత ఆ యూట్యూబ్ ఛానెల్స్ కు డబ్బు ఇచ్చి తమ పరువు తీయడానికి ప్రయత్నించింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అని మరోసారి పోలీసులను ఆశ్రయించింది పవిత్ర.

ఇక తాజాగా వీరిపై నాంపల్లి కోర్టు ను ఆశ్రయించిన నరేష్ జంట. తమ పరువు తీయడానికి ప్రయత్నించిన యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. వారి కేసును విచారించిన కోర్టు 12 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్లపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ ఛానెల్స్ ఏంటంటే.. ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్ప్రెషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ లకు నోటిసులు ఇచ్చి విచారణ జరపాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Show comments